హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై కత్తితో దాడి

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రాయదుర్గంలో పరిధి ఊరపోచమ్మ ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై గోవర్ధన్ అనే ఉన్మాది కత్తితో దాడి చేశాడు.

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై కత్తితో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రాయదుర్గంలో పరిధి ఊరపోచమ్మ ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై గోవర్ధన్ అనే ఉన్మాది కత్తితో దాడి చేశాడు. పక్కింటి భవనం పై నుండి యువతి ఇంట్లోకి చొరబడిన యువకుడు మొదట యువతి అక్క గొంతుపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. తరవాత అడ్డుకునేందుకు వచ్చిన యువతి, ఆమె తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. వారిని కాపాడేందుకు వచ్చిన యువతి బాబాయ్ పైనా కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో యువతి, కుటుంబ సభ్యులు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రేమను నిరాకరించింది అనే కారణంతోనే నిందితుడు దాడికి పాల్పడినట్టు యువతి కుటుంబ సభ్యలు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story