యాష్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చేవారం 'టాక్సిక్' నుంచి సూపర్ అప్డేట్

by Pulgam srinivas |

టాక్సిక్ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యాష్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చేవారం టాక్సిక్ నుంచి సూపర్ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం 'టాక్సిక్' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటికే పలు అప్డేట్లు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ సినిమా విడుదలపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మేకర్స్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో యష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

'టాక్సిక్' చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్‌ను వచ్చే వారం విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో యష్ అభిమానులు ఈ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story