- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు అసలు పడవు..!
దేశవ్యాప్తంగా లబ్దిదారుల ఖాతాల్లోకి నేడు కిసాన్ సమ్మాన్ యోజన నిధులు జమ కానున్నాయి. అయితే దేశంలోని చాలా మంది రైతులు తమకు అర్హతలు ఉన్నప్పటికీ కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు పడటంలేదని ఆందోళన చెందుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా లబ్దిదారుల ఖాతాల్లోకి నేడు కిసాన్ సమ్మాన్ యోజన నిధులు జమ కానున్నాయి. అయితే దేశంలోని చాలా మంది రైతులు తమకు అర్హతలు ఉన్నప్పటికీ కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు పడటంలేదని ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఈ కేవైసీ పూర్తి చేయని రైతుల అకౌంట్లలో డబ్బులు పడవు. పీఎం కిసాన్ యోజనకు అర్హులు అవ్వాలంటే కచ్చితంగా ఈకేవైసీ చేసుకుని ఉండాలని ప్రభుత్వం కండిషన్ పెట్టింది. కేవైసీ చేసుకోని రైతులు pmkisan.gov.in వెబ్ సైట్ లో చేయవచ్చు. వెబ్ సైట్ కు వెళ్లిన తరవాత అందులో e-KYC అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసిన తరవా ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెబ్ సైట్ లో సబ్ మిట్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. సొంతంగా చేసుకోలేనివాళ్ళు మీసేలా, సీఎస్సీ కేంద్రాల్లో కూడా బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కింద పంట సాయం కోసం రైతులకు ప్రతి ఏడాది రూ.6వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. వీటిని మూడు విడతలుగా 2వేల చొప్పున జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనలో భాగంగా నిధులను విడుదల చేయనున్నారు.






