- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'తెల్ల కాగితం' ఆడియో హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ
by Pulgam srinivas |
‘తెల్ల కాగితం’ ఆడియో హక్కులను ప్రముఖ సంగీత సంస్థ సరిగమ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్: హర్ష్ రోషన్, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘తెల్ల కాగితం’ ఆడియో హక్కులను ప్రముఖ సంగీత సంస్థ సరిగమ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కోర్టు’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష్ రోషన్, కొంతకాలం క్రితం ‘బ్యాండ్ మేళం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ‘తెల్ల కాగితం’ చిత్రంతో హర్ష్ రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Next Story






