- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీని కలిసే ధైర్యం కేసీఆర్‌కు లేదు: రాజాసింగ్
తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టబోతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి కలిసే ధైర్యం కేసీఆర్‌కు లేదని విమర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టబోతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి కలిసే ధైర్యం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. దమ్ము ఉంటే ప్రధానిని కలిసి రాష్ట్ర అభివృద్ధిపై అడగాలని సూచించారు. బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ రెండూ ఒకటే అని అన్నారు. కుట్ర పూరితకంగా తెలంగాణపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ప్రచారం చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం 02:05 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకొని.. ప్రజా గర్జన సభలో పాల్గొంటారు.
Next Story






