Revanth Reddy, Komati Reddy, Uttam Kumar Reddy మధ్య జరిగిన చర్చ ఇదే!

by GSrikanth |   (  Updated:2023-07-19 14:27:06  IST  )

ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు.

Revanth Reddy, Komati Reddy, Uttam Kumar Reddy మధ్య జరిగిన చర్చ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. గత పదేళ్లుగా రెడ్డిలకు పవర్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఈ ముగ్గురు ఎంపీలు డిస్కషన్ చేసుకున్నట్లు సమాచారం. పార్టీలో చేరికలు, ప్రియాంక సభపై బుధవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన మీటింగ్‌లో ఈ ముగ్గులు రెడ్డి నేతలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. టీఆర్ఎస్ రెడ్డి నేతలు కూడా పార్టీ ఏదైనా సరే.. మనోళ్లు పవర్ పాయింట్‌లో ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి.. ఉత్తమ్, వెంకటరెడ్డికి వివరించినట్లు సమాచారం.



Next Story