- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేపర్ లీకులు జరుగకుండా కఠిన చట్టాలు తెచ్చాం: సీఎం
టీఆర్ఎస్ పాలనలో అంతా పరీక్ష పేపర్ల లీకులు కొనసాగితే 9 ఏళ్ల మోడీ పాలన అంతా ఆర్థి నేరాల మయం అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పాలనలో అంతా పరీక్ష పేపర్ల లీకులు కొనసాగితే 9 ఏళ్ల మోడీ పాలన అంతా ఆర్థి నేరాల మయం అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతిలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆరోపించారు. రాజస్థాన్ లో ఎవరైనా పరీక్షా పత్రాలు లీక్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టాలు తీసుకువచ్చామన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి అలవాటే అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని తెలిసే బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఈడీని ప్రయోగిస్తోందని ద్వజమెత్తారు. మోడీ పాలనలో బడా వ్యాపారులు బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాలకు పారిపోయారని ధ్వజమెత్తారు. బడా వ్యాపారులు ఎగవేసిన కోట్లాది రూపాయల అప్పులను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉంటే బీజేపీ అగ్రనేతలు మిజోరంకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.






