- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొంగులేటి రూమ్ తాళం కోసం అధికారుల వెయిటింగ్!
ఎన్నికల వేళ సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉన్న పొంగులేటి నివాసం, నందగిరి హిల్స్‌లోని ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉన్న పొంగులేటి నివాసం, నందగిరి హిల్స్‌లోని ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో పలు కీల డ్యాకుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
నిన్న ఖమ్మంలో తనిఖీల అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య, కుమారుడు, తమ్ముడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరబాద్ తరలించారు. ఇవాళ వారి వద్ద నుంచి మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు పొంగులేటికి సంబంధించిన రూమ్ కీ లేకపోవడంతో తాళాల కోసం ఐటీ అధికారులు వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. మరో వైపు పొంగులేటిపై జరుగుతున్న ఐటీ రెయిడ్స్‌ను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతున్నది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నది.






