అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్ద హైడ్రామా.. ఎంపీ కోమటిరెడ్డి సీరియస్

by Disha Web Desk 2 |
అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్ద హైడ్రామా.. ఎంపీ కోమటిరెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్‌పై ఏపీ పోలీసులు కంచె వేయడంతో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం సాగర్ వద్ద హైడ్రామా సృష్టించిందని ఆరోపించారు. ఓట్లు దండుకునేందుకు ఏపీ, తెలంగాణ మధ్య సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని నీటి వివాదం అర్ధరాత్రి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుట్రలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని సూచించారు.

Read More : సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్?...నాగార్జున సాగర్ డ్యాంపై ఉద్రిక్తత......ప్రధాన గేటు ధ్వంసం చేసి డ్యాంపైకి ప్రవేశించిన ఏపీ పోలీసులు


Next Story

Most Viewed