సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్? (వీడియో)

by Admin |
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్? (వీడియో)
X

- ప్రధాన గేటు ధ్వంసం చేసి డ్యాంపైకి ప్రవేశించిన ఏపీ పోలీసులు

- ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్‌పై దాడి

- 13వ గేటు వరకు తమదేనంటు దౌర్జన్యం, కంచె ఏర్పాటు

- కుడి కాల్వ నుంచి నీటిని తరలించేందుకు యత్నం

- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఘటన

- సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్ చేశారంటూ ఆరోపణలు

- కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు ఎత్తుగడ?

దిశ, నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి చెందిన పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులు దౌర్జన్యం ప్రదర్శించారు. ప్రధాన గేటును ధ్వంసం చేసి డ్యాంపైకి ప్రవేశించారు. అడ్డుకోబోయిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్‌పై దాడి చేశారు. సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. డ్యాం 13వ గేట్ వరకు తమదేనంటూ దబాయించారు. ఈ దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్న వారి ఫోన్లను సైతం పగులగొట్టారు. దీంతో డ్యాం భద్రతా బలగాలకు, ఏపీ పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

13వ గేటు వద్ద కంచే ముళ్ల ఏర్పాటు చేసుకన్న ఏపీ పోలీసులు

భారీ ఎత్తున డ్యాంపైకి చేరుకున్న ఏపీ పోలీసులు.. 26వ గేటు నుంచి 13వ గేటు వరకు ముళ్ల కంచె ఏర్పాటు చేసుకున్నారు. కుడి కాల్వ నుంచి నీటిని తరలించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎస్పీఎఫ్ ఆర్ఐ భాస్కర్ చర్యలు చేపట్టారు. 2015 ఫిబ్రవరి 13న సైతం ఇలాగే ఇరు రాష్ట్రాల పోలీసులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై మరొకరు దాడులు సైతం చేసుకున్నారు.

తెరవెనుక కేసీఆర్?

వ్యూహాత్మకంగా ఏపీ పోలీసులు ఈ దౌర్జన్యానికి పాల్పడి నీటి విషయంలో గొడవకు దిగారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనక కేసీఆర్ ఉన్నారని, ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ కుట్రకు పాల్పడి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణకు చెందిన నీటి వనరులను ఆంధ్రాకు తరలించుపోతారని, రాష్ట్రాన్ని తిరిగి ఎడారిగా మార్చుతారనే భయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ఈ కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed