- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు కవిత ఎన్ని సీట్లు ఇప్పించింది.. షబ్బీర్ అలీ సీరియస్
తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ సంపదను మహారాష్ట్రలో పార్టీ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ సంపదను మహారాష్ట్రలో పార్టీ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు. మహిళల హక్కులు, రిజర్వేషన్ గురించి మాట్లాడే కవిత ఎంతమంది మహిళలకు టికెట్లు ఇప్పించిందని ప్రశ్నించారు. అసలు దళితులు, మైనార్టీలు, మహిళల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని.. రాగానే బీఆర్ఎస్ అక్రమాల చిట్టాను బయటకు తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం గొప్పలకు పోయి తీసుకొచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేదని విమర్శించారు.






