- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
by GSrikanth |
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీలో చేరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీలో చేరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. కేఎస్ రత్నం మాట్లాడుతూ జలదృశ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టిన సందర్భంగా తనకు ఇంకా 7 నెలల పదవీ కాలం ఉండాగానే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరానన్నారు. అలాంటి తనకు బీఆర్ఎస్ లో గుర్తింపు దక్కలేదన్నారు. పార్టీలో తనకు పదవులు ఇవ్వలేదని తాను ప్రశ్నిస్తాననే ఉద్దేశంతోనే తనకు కేసీఆర్ పదవులు ఇవ్వలేదేమో అని విమర్శించారు. తనకు టికెట్ దక్కినా దక్కకపోయినా బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు.
Next Story






