- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం ఈ-టెండర్లకు ఈసీ బ్రేక్
వరి ధాన్యం ఈ-టెండర్లకు ఈసీ బ్రేక్ వేసింది. రబీ సీజన్ ధాన్యం అమ్మకాలకు టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఈసీ శనివారం పేర్కొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వరి ధాన్యం ఈ-టెండర్లకు ఈసీ బ్రేక్ వేసింది. రబీ సీజన్ ధాన్యం అమ్మకాలకు టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఈసీ శనివారం పేర్కొంది. ధాన్యం అమ్మకాలకు పౌర సరఫరాల సంస్థ ఈనెల 6న టెండర్లను ఆహ్వానించింది. అయితే ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జి. నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ-వేలం విలువ సుమారు 5 వేల కోట్లు. ప్రస్తుత ప్రభుత్వం ఈ టెండర్లను జారీ చేయడం ద్వారా డబ్బును సేకరించాలని యోచిస్తోంది.
తద్వారా ఆ డబ్బును ఇతర ప్రయోజనాల కోసం మళ్లించవచ్చని ఆయన ఆరోపించారు. అలాగే ఈ ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నం అని ఎన్నికల కోడ్ ముగిసే వరకు ధాన్యం ఈ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈసీ టెండర్ల ప్రక్రియకు బ్రేకులు వేసింది. తాము ఆదేశాలు ఇచ్చే వరకు టెండర్లు పిలవొద్దని ఆదేసించింది.






