- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఓటర్లకు ఎన్నికల అధికారి కీలక పిలుపు
ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రజలలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు శనివారం గచ్చిబౌలిలో 'లెట్స్ ఓట్స్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఈవో వికాస్ రాజ్, డీజీపీ అంజనీ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కులం, మతం, జాతి, ప్రాంతం లాంటి ప్రలోభాలకు లొంగకుంటా అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటు వేస్తే ప్రజాస్వామ్య ప్రక్షాళన జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు అన్నారు.
Next Story






