D. K. Aruna : పార్టీ మార్పు వార్తలపై స్పందించిన డీకే అరుణ

by Disha Web Desk 2 |
D. K. Aruna : పార్టీ మార్పు వార్తలపై స్పందించిన డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని వార్త పత్రికలు, మీడియా ఛానళ్లు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని ఆమె క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నుంచి వలసలు ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ప్రసార మాధ్యమాలకు బాధ్యతలు అప్పగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారంలో పాల్గొంటున్న విషయం కొన్ని పత్రికలు, ఛానళ్లకు కనిపించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై మరోసారి మీడియా తమ ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.


Next Story

Most Viewed