- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఈ ప్రాంతమంటే నాకు ప్రాణం: సీఎం కేసీఆర్
by GSrikanth |
అంకాపూర్ గురించి ఈ ప్రపంచంలో నేను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

X
దిశ, వెబ్డెస్క్: అంకాపూర్ గురించి ఈ ప్రపంచంలో నేను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తాయి పోతాయి.. పార్టీకి ఒకరు నిలబడుతారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అందర్నీ ప్రార్థించేది ఒక్కటే. ఇక్కడ రైతాంగం అధికంగా ఉంటది. పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. అంతమంచి అభ్యుదయమైన రైతులు. అంకాపూర్ రైతుల చైతన్యంతో, వారిని స్ఫూర్తిగా తీసుకొని వందలాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు.
Next Story






