ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: కేసీఆర్

by GSrikanth |

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భైంసా పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భైంసా పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా దళితుల గురించి ఆలోచించలేదని అన్నారు. దళితబంధు పుట్టించి అభివృద్ధికి బాటలు వేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు.

ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని రైళ్లు, విమానాశ్రయాలు, కరెంట్ కూడా ప్రయివేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. ప్రాణం పోయినా మీటర్లు పెట్టబోమని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆరునూరైనా బీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఆగం ఆగం కావొద్దు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story