కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్! ఈటలపై పోటీకి కీలక నేత?

by Disha Web Desk 4 |
కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్! ఈటలపై పోటీకి కీలక నేత?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌పై పాడి కౌశిక్ రెడ్డి కాకుండా మాజీ మంత్రి పెద్ది రెడ్డి బరిలో దిగుతారని ప్రచారం సాగుతోంది. ఈటలను ఓడించేందుకు గులాబీ‌బాస్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డికే టికెట్ ఇస్తారని అంతా భావించారు. నేరుగా కేటీఆర్ కూడా కౌశిక్‌నే బరిలో దించుతామని ప్రకటించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కౌశిక్ స్థానంలో పెద్దిరెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

కౌశిక్‌రెడ్డి ఔట్.. పెద్దిరెడ్డి ఇన్?

హుజురాబాద్ సెగ్మెంట్‌పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. తనను దిక్కరించిన ఈటలను వచ్చే ఎన్నికల్లో ఓడించడం కేసీఆర్‌కు పరీక్షగా మారింది. ఈటలను ధీటుగా ఎదుర్కొంటారని భావించి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ప్రభుత్వ విప్‌గా నామినేట్ చేశారు. అయితే కౌశిక్‌రెడ్డి అనేక వివాదాల్లో తలదూర్చడంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. దీంతో కౌశిక్‌కు టికెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన గులాబీ బాస్.. ఇక కౌశిక్ రెడ్డిని నమ్ముకోవడం కంటే మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డికి పోటీకి దింపడం బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read more: బ్రేకింగ్ : BJP స్టేట్ చీఫ్ మార్పుపై స్పందించిన తరుణ్ చుగ్....మీడియా కథనాలపై కీలక వ్యాఖ్యలు



Next Story

Most Viewed