ఆదివారం రాత్రి బోరుబోరున ఏడ్చిన బీజేపీ మహిళా నేత.. నన్ను మోసం చేశారంటూ..

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-25 06:10:36  IST  )

బీజేపీ అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. నిన్న ఆ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆదివారం రాత్రి బోరుబోరున ఏడ్చిన బీజేపీ మహిళా నేత.. నన్ను మోసం చేశారంటూ..
X

దిశ,భైంసా : బీజేపీ అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. నిన్న ఆ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్ట్ లో సీనియర్ లీడర్లకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో సేవ చేస్తున్న నాయకులకు కూడా టికెట్ లభించలేదు. దీంతో కమలం పార్టీలో అగ్గిరాసుకుంటుంది. ఈ క్రమంలోనే బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అధిష్టానంపై ఫైర్ అవుతూ కన్నీరు మున్నీరు అయ్యారు. అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన అనంతరం ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన ఆవేదనను వెల్లడించారు.

మొన్న కాక నిన్న వచ్చిన వాళ్లకి పార్టీ టికెట్ ఇస్తే ఎలా అంటూ పార్టీని ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి బీజేపీ తనకు అన్యాయం చేసిందని వాపోయింది. నియోజకవర్గంలో రెండు సార్లు రెండవ స్థానంలో ఉన్న తనను కాదని, మూడవ స్థానంలో ఉన్న కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. నమ్ముకున్న పార్టీ నన్న మోసం చేసిందని కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీకి, జిల్లాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తానని, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాని చెప్పారు. ముధోల్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

Next Story