చంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్ రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 2 |
చంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మంగళవారం బండి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అవినీతిపై ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలి.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. కానీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అన్నారు. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఆయన్ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

Next Story