- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్లను ప్రభావితం చేసే స్కీమ్స్‌పై చర్యలు తీసుకోండి!
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుమారెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి బుధవారం ఫిర్యాదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుమారెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి బుధవారం ఫిర్యాదు చేశారు. కొంతమంది అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అందువల్ల సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలను తక్షణమే బదిలీ చేయాలని కోరారు. వీరితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులను విధుల నుంచి తప్పించి కేంద్ర పోలీసు బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఓటర్లను ప్రభావితం చేయగల రైతుబంధు, దళితబంధు, బీసీబంధు స్కీమ్‌లను ఎన్నికలు పూర్తయ్యే వరకు బంద్ చేయాలని కోరారు. ముఖ్యంగా రైతుబంధు స్కీమ్ యాసంగి పెట్టుబడి సాయం గతంలో మాదిరిగా జనవరిలో కాకుండా నవంబర్ 20 లోపే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఇదే జరిగితే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందునా ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ పథకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.






