HYD: ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జాం (వీడియో)

by GSrikanth |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టణాల నుంచి గ్రామాలకు ఓటర్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరం ఒక్కసారిగా ఖాళీ అయినట్లు కనబడుతుంది.

HYD: ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జాం (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టణాల నుంచి గ్రామాలకు ఓటర్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరం ఒక్కసారిగా ఖాళీ అయినట్లు కనబడుతుంది. మరోవైపు ఓటర్లు ఊర్లకు పయన అవ్వడంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో ట్రాఫిక్ భారీగా ఉంది. సాయంత్రంలోగా పోలింగ్ స్టేషన్ చేరుకోవాలనే తపనతో అందరూ ఇవాళ ఉదయం నుంచే ఊర్ల బాట పట్టారు.

Next Story