- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదుగురు గుమిగుడితే కఠిన చర్యలు: ఈసీ
by Kodari Anjali |
ప్రస్తుతం తెలంగాణలో పోలింగ్ కొన్ని గంటలే సమయం ఉంది.

X
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం తెలంగాణలో పోలింగ్ కొన్ని గంటలే సమయం ఉంది. దీంతో ఆయా పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలయ్యింది. గెలుస్తామో, లేదో? ఎన్ని ఓట్లు వస్తాయని పార్టీ అభ్యర్థుల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు నేతలు.. ప్రజలను తమవైపు తిప్పుకునేలా డబ్బులు పంచిపెట్టాలని నానా తంటాలు పడుతున్నారు. కాగా ఇప్పటికే పలువురు పోలీసులు చేతికి చిక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే కేవలం డబ్బు పంపిణీని అడ్డుకోవడమే కాదు.. ఐదుగురు వ్యక్తులు ఒకే దగ్గర గుమిగుడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా ఈసీ హెచ్చరించింది. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు, కెమెరా, లాప్ టాప్ తీసుకెళ్లొద్దని సూచించింది.
Next Story






