- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిచ్చగాళ్లం కాదు.. వాటాదారులం: ఆర్.కృష్ణయ్య
by GSrikanth |
బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వేలాది మందితో ఈ నెల 13,14వ తేదీలలో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వేలాది మందితో ఈ నెల 13,14వ తేదీలలో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శనివారం కాచిగూడలో నిర్వహించిన వివిధ రాష్ట్రాల బీసీ సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోడీ సర్కార్ అణిచివేస్తుందని మండిపడ్డారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, బీసీలంటే వాటాదారులని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






