- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న గోవా ముఖ్యమంత్రి
by GSrikanth |
హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్డమీద ప్రయాణం నరకమే అని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఓవైపు ఉద్యోగాలకు వెళ్లి తిరిగొస్తున్న వారు..

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్డమీద ప్రయాణం నరకమే అని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఓవైపు ఉద్యోగాలకు వెళ్లి తిరిగొస్తున్న వారు.. మరోవైపు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచార వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ ట్రాఫిక్‌లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ పాండురంగ చిక్కుకున్నారు. సోమవారం ఆయన నగరంలో పర్యటించారు. హోటల్ కత్రియ నుంచి బయటకు వచ్చాక దాదాపు 15 నిమిషాల పాటు కాన్వాయ్ ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. దీంతో పోలీసులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వస్తే కూడా ప్రొటోకాల్ ఇవ్వరా? అని ప్రశ్నించారు.
Next Story






