బీఆర్ఎస్‌లో చేరిన జడ్చర్ల కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్

by GSrikanth |

జడ్చర్ల కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎర్ర శేఖర్‌కు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్‌లో చేరిన జడ్చర్ల కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్/జడ్చర్ల: జడ్చర్ల కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎర్ర శేఖర్‌కు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌, మరోనేత అనిరుధ్‌రెడ్డి పోటీపడ్డారు. చివరికి అనిరుధ్‌కే టికెట్‌ దక్కడంతో ఎర్రశేఖర్‌ వర్గం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఎర్రశేఖర్‌ అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో తన నివాసంలో సమావేశమై కాంగ్రెస్‌ రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ ఆదివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

Next Story