- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telangana Assembly Election 2023 > ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి పోలీసులు
ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి పోలీసులు
by GSrikanth |
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విసిరిన సవాల్‌ను బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా స్వీకరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విసిరిన సవాల్‌ను బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా స్వీకరించారు. చర్చించేందుకు తాను సిద్ధమని.. ఎక్కడికైనా వస్తానని ప్రకటించారు. ఇవాళే(సోమవార) చర్చి్ద్దామని.. రెడీగా ఉండాలని సూర్యనారాయణ సైతం సవాల్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో చర్చలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామునే సూర్యనారాయణ ముందు భారీగా మోహరించారు. చర్చకు వెళ్తే అరెస్ట్ చేస్తామని సూర్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు మోహరించిన విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సైతం భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది.
Next Story






