చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలంగాణలో సైతం అభిమానులు, పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ రాక్షసంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పార్టీలకు అతీతంగా ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఏపీని అభివృద్ధి చేయడంలో బాబు అనేక సంక్షేమ పథకాలు, ఐటీ సెక్టార్‌లో గొప్ప పాత్ర వహించారన్నారు. దీంతో హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా చంద్రబాబు కృషి వల్లే అయ్యిందన్నారు. ఏపీ సీఎం జగన్ రాక్షస పాలనను ప్రజలు గుర్తిస్తున్నారని, చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.



Next Story

Most Viewed