కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదనపు హామీలు.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదనపు హామీలు.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే వారమే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ డి.శ్రీధర్ బాబు చెప్పారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లతో పాటు అదనంగా మరికొన్ని హామీలు మేనిఫెస్టోలో ఉండబోతున్నాయని వెల్లడించారు. శనివారం ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన శ్రీధర్ బాబు... మా హామీలను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. రాహుల్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన శ్రీధర్ బాబు.. రాహుల్‌ను విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు.

కాగా, ప్రజలకు మేలు చేసేలా, అమలు చేయగలిగే పథకాలు, హామీలనే మేనిఫెస్టోలో పెడుతున్నామని కాంగ్రెస్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆయా జిల్లాలు నేతలు, సంఘాల నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత తర్వాతే పూర్తి స్థాయిలో మేనిఫెస్టో తయారు చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story