- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన గవర్నర్ నియమకాలు రూల్స్‌కు విరుద్ధం
by GSrikanth |
నూతన గవర్నర్ నియామకాలు రూల్స్‌కు విరుద్ధమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ కొత్త గవర్నర్లను ఎలా నియమిస్తారంటూ? ఫైర్ అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: నూతన గవర్నర్ నియామకాలు రూల్స్‌కు విరుద్ధమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ కొత్త గవర్నర్లను ఎలా నియమిస్తారంటూ? ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఎలక్షన్ కమిషన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి భవన్ ఎన్నికల కోడ్ ను ఉల్లంగించిందని లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తి మల్లు ఇంద్రసేనా రెడ్డికి బాధ్యతలు ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అందరికీ ఎన్నికల కోడ్ సమానంగానే ఉంటుందని, ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందే నిరంజన్ నొక్కిచెప్పారు.
Next Story






