- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోరుట్లలో నాకూ ఫ్రెండ్స్ ఉన్నారు.. MP అర్వింద్‌కు బీజేపీ నేత స్వీట్ వార్నింగ్!
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డివి అవగాహన లేని వ్యాఖ్యలని శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేత యోగానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డివి అవగాహన లేని వ్యాఖ్యలని శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేత యోగానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌కు చెందిన ఎంపీ అర్వింద్ శేరిలింగంపల్లి సీటు విషయంలో రాజకీయాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కోరుట్లలో తనకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారని, ఏం చేయాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. తనకు శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ను గెలిపించినట్లే అవుతుందని యోగానంద్ వెల్లడించారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వకుంటే చేవెళ్ల పార్లమెంట్ సీటు అడుగుతానని యోగానంద్ చెప్పారు. ఇదిలా ఉండగా కొండా చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. తన సీటు విషయంలో వేలు పెట్టినందుకే యోగానంద్ కొండా సీటు విషయంలో వేలు పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. కాగా అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.






