TS: షర్ట్ లేకుండా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి

by Disha Web Desk 2 |
TS: షర్ట్ లేకుండా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో అసలైన రాజకీయం మొదలైంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఈ క్రమంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ వర్గాల నుంచి సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా.. నామినేషన్ దాఖలు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వరుసగా బరిలో నిలిచే నేతలంతా దాఖలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు నిరసనగా ఓ వ్యక్తి వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. భువనగిరి నియోజకవర్గంలో శివసేన పార్టీ మద్దతుతో టీపీఎస్ పార్టీ తరపున బరిలో నిలిచిన పూస శ్రీనివాస్ అనే వ్యక్తి అర్ధనగ్నంగా సైకిల్‌పై వెళ్లి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేసిన పార్టీలను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed