- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షేక్ పేటలో బీజేపీకి జీరో ఓట్లు.. కనీసం ఏజెంట్లు కూడా వేయలేదా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుండగా.. బీజేపీ మాత్రం పూర్తి వెనుకంజలో ఉంది. అయితే షేక్ పేట డివిజన్ ఓట్ల లెక్కింపులో ఆ వింత ఘటన ఎదురైంది. షేక్ పేట డివిజన్ లో ఓట్ల లెక్కింపు చేస్తుండగా.. అక్కడ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడకపోవడం పట్ల సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
షేక్ పేట డివిజన్లో బీజేపీకి జీరో ఓట్లు పోల్ కాగా.. కనీసం ఆ పార్టీ ఏజెంట్లు కూడా బీజేపీకి ఓటు వేయలేదా అంటూ షాక్ గురయ్యారు కౌంటింగ్ సిబ్బంది. కాగా ఓటమి తప్పదని అర్థమైన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 7వ రౌండ్ లోనే ఇంటికి వెళ్లిపోవడం గమనార్హం. ప్రస్తుతం 9వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 22,112 ఓట్ల లీడ్ లో ఉన్నారు.
READ MORE .....
జూబ్లీహిల్స్లో డిపాజిట్ గల్లంతుపై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు






