బ్రేకింగ్: YSRTP చీఫ్ షర్మిల అరెస్ట్.. హయత్ నగర్ పీఎస్‌కు తరలింపు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: YSRTP చీఫ్ షర్మిల అరెస్ట్.. హయత్ నగర్ పీఎస్‌కు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని సాగర్ రింగ్ వద్ద షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆగస్ట్ 15వ తేదీన పోలీసుల చేతిలో గాయపడ్డ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల ఇవాళ నిరసనకు దిగారు. సాగర్ రింగ్ రోడ్డుపై బైఠాయించి షర్మిల ఆందోళన చేశారు. షర్మిల రోడ్డుపై బైఠాయించడంతో సాగర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిలను అరెస్ట్ చేయడంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed