- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఇంకా కొన్ని కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, అందువల్ల సీబీఐ (CBI) దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు.
గత పరిణామాలు - సీబీఐ కోర్టు ఉత్తర్వులు
గతంలో సీబీఐ కోర్టులో సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేస్తూ.. నిందితులుగా భావిస్తున్న కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ కాల్ డేటాను క్షుణ్ణంగా విశ్లేషించాలని కోరారు. దీనిపై స్పందించిన సీబీఐ కోర్టు, ఆ దిశగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే దర్యాప్తు నిర్వహించిన సీబీఐ.. సదరు వ్యక్తుల పాత్రపై సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను, సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను లేవనెత్తిన పలు సందేహాస్పద అంశాలకు సీబీఐ దర్యాప్తులో సరైన సమాధానాలు లభించలేదని ఆమె వాదించారు. ముఖ్యంగా కాల్ డేటా విశ్లేషణ, కుట్ర కోణంలో ఇంకా లోతైన విచారణ అవసరమని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రాథమిక విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. తదుపరి వాదనలను వినేందుకు విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.






