- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు రూ.50 వేలు ఇవ్వాలి’
by GSrikanth |
ముఖ్యమంత్రి కేసీఆర్‌ది రౌడీల పాలన అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌ది రౌడీల పాలన అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పేపర్ లీకేజీ అంశంపై యువత నోరెత్తితే కేసులు పెట్టి హింసిస్తున్నారని పేర్కొన్నారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓయూ, కేయూ విద్యార్థులపై సర్కార్ చేపడుతున్న అణచివేత చర్యలను ఖండించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి లాఠీచార్జీలు, అరెస్టులు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పేపర్ లీక్ వెనక ప్రభుత్వ పెద్దల హస్తం లేకపోతే సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితోనైనా దర్యాప్తు జరిపించాలన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ప్రతి నిరుద్యోగికి తక్షణసాయంగా రూ.50 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Next Story






