తెలంగాణలో ఆఫ్గానిస్థాన్‌ను తలపించే తాలిబన్ల పాలన: Y. S. Sharmila

by Satheesh |
తెలంగాణలో ఆఫ్గానిస్థాన్‌ను తలపించే తాలిబన్ల పాలన: Y. S. Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై షర్మిల శుక్రవారం ట్వీటర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో 10 ఏళ్లుగా సాగింది సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి కాదు. అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన"అని పేర్కొన్నారు. రాష్టంలో ఆఫ్గనిస్తాన్‌ను తలపించిన తాలిబాన్ల పాలన ఉందన్నారు. 5 లక్షల కోట్లు అప్పులు చేసి.. ఒక్కో నెత్తిమీద 2 లక్షల అప్పు మోపి తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని పవర్ పాయింట్ ప్రెజేంటేషన్లు ఇచ్చుకోవడినికి సిగ్గు ఉండాలని ఆమె విమర్శించారు. దేశంలో ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం నెంబర్ 1గా ఉంటే.. నిరుద్యోగులు 50 లక్షల మంది ఎందుకున్నట్లు..? ఉద్యోగాలిస్తే వందలాది మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్లు అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో పట్టుమని 65 వేల ఉద్యోగాలు ఇవ్వచేతకాని మీరు.. ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్లు, నిరుద్యోగులను ఉద్ధరించినట్లు బహిరంగ చర్చకు సవాళ్లు విసురుతున్న తీరుకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాకుండా ఉందని ధ్వజమెత్తారు. మీ దరిద్రపు పాలనలో టీఎస్పీఎస్సీ లీకుల బాగోతం దేశమంతా ఎరుకేనని.. ఇంకా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతారని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మీ అవివేకానికి నిదర్శనమరి షర్మిల పేర్కొన్నారు.



Next Story

Most Viewed