క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న పెద్ద సన్నాసి కేసీఆర్: YS షర్మిల ఫైర్

by Disha Web Desk 19 |
క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న పెద్ద సన్నాసి కేసీఆర్: YS షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణాలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని.. ఓటమి ఖాయమని తెలిసే తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుందని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే కనీసం లక్ష ఇండ్లు కట్ట చేతకాలేదని విమర్శలు గుప్పించారు. చెప్పేటోనికి వినేటోడు లోకువ అన్నట్లు కేసీఆర్ తీరుందని ఆమె అన్నారు. ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు ఎక్కడ అని నిలదీస్తే.. చిన్న దొరకు కోపం వస్తుందని.. చెత్త నా కొడుకులు, సన్నాసులు అంటూ.. అధికార మదంతో కళ్లు నెత్తికెక్కినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌కు నిరుద్యోగులు సన్నాసుల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.

ఉద్యమం సమయంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చిన సన్నాసులు నువ్వు మీ నాన్న విరుచుకపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వలేక పేపర్లు లీకులు చేసి అమ్ముకున్న పెద్ద సన్నాసి కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన సన్నాసుల పాలన బీఆర్ఎస్ పార్టీదన్నారు. నిరుద్యోగుల శవాల మీద ఇంతకాలం అధికారంలో కూర్చున్న బీఆర్ఎస్‌కు ఓట్లు అడగడానికి ఇజ్జత్, మానం ఉండాలని ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణలో ఇంటిల్లిపాది కొలువులు అనుభవించారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కేటీఆర్ వింత మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.

Next Story

Most Viewed