ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవం..మీడియాపై దాడిని ఖండిస్తున్నా: షర్మిల

by Ajay Maddhiboyina |

టీవీ ఛానల్‌పై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణం అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అని చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవం..మీడియాపై దాడిని ఖండిస్తున్నా: షర్మిల
X

దిశ‌, వెబ్ డెస్క్: టీవీ ఛానల్‌పై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణం అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అని చెప్పారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. ఆ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి తనకు చెప్పారని అన్నారు. కేసీఆర్, జగన్ జాయింట్ ఆపరేషన్‌గా ఫోన్ ట్యాపింగ్ చేశారో లేదా కో ఆపరేషన్‌గా చేశారో తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాత్రం వాస్తవం అని అన్నారు.

వాస్తవాలను బయటపెడుతున్న మీడియాపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. ఇంతమంది ఫోన్లు ట్యాప్ అవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని అన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలోనూ షర్మిల అనేకసార్లు తన ఫోన్ ట్యాప్ అయ్యిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను తెలంగాణలో పార్టీ పెట్టిన సమయంలో తన ఫోన్ ట్యాప్ చేసి ఆ సమాచారం జగన్‌కు పంపించారని ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ అయినట్టు తన కాల్స్ తానే విన్నానని తెలిపారు.

Next Story