- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేవాభావానికి నిలువెత్తు నిదర్శనం.. క్లిష్టమైన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని తక్కువ ఖర్చుతో విజయవంతం చేసిన వైద్య బృందం
నేటి సమాజంలో వైద్యం అంటే ఖర్చుతో కూడిన పని. అలాంటి వైద్యంలో లాభాపేక్ష లేకుండా రోగులకు అండగా నిలిచింది డాక్టర్ కూరపాటి వైద్య బృందం.

దిశ, ఖమ్మం: నేటి సమాజంలో వైద్యం అంటే ఖర్చుతో కూడిన పని. అలాంటి వైద్యంలో లాభాపేక్ష లేకుండా రోగులకు అండగా నిలిచింది డాక్టర్ కూరపాటి వైద్య బృందం. చిన్న రోగం వచ్చినా లక్షల రూపాయలు ఉంటేనే వైద్యం అందుతున్న తరుణంలో క్లిష్టమైన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని తక్కువ ఖర్చుతో విజయవంతం చేసి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు. విషయంలోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలంలోని ఓ నిరుపేద కుటుంబం ఆశలు వదులుకుంది. చిన్నారి ప్రాణాలను కాపాడాలనే తపన ఉన్నా, చేతిలో డబ్బు లేక నిస్సహాయంగా నిలిచిపోయింది. అటువంటి సమయంలో ఖమ్మంలోని కూరపాటి చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి అండగా నిలిచింది. తల్లంపాడుకు చెందిన జి.ఆషీర్‌కు వచ్చిన ఫిట్స్ వెనుక బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వెంటనే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. అంత ఖర్చుతో కూడిన వైద్యం చేయాలంటే కుటుంబం ఆందోళనలో పడ్డారు. ఆ సమయంలో ఆసుపత్రి యాజమాన్యం ధైర్యం చెప్పింది. చివరకు ఆ చిన్నారి జీవితంలో కొత్త వెలుగులు నింపింది.
హైదరాబాద్‌లో ఆపరేషన్‌కు భారీ మొత్తం అవసరమని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డను ఎలా కాపాడుకోవాలనే ఆవేదన వారిని వెంటాడింది. ఆ సమయంలో డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ వారి పరిస్థితి చూసి అర్థం చేసుకున్నారు. డబ్బు కంటే ప్రాణం ముఖ్యమని భావించి తక్కువ ఖర్చుతోనే శస్త్రచికిత్స చేపట్టాలని నిర్ణయించారు. వైద్య సేవను వ్యాపారంగా కాకుండా బాధ్యతగా చూసిన ఆయన నిర్ణయం కుటుంబానికి ఊరటనిచ్చింది. చిన్నారి చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. దీంతో నిరాశలో ఉన్న తల్లిదండ్రుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రముఖ నిపుణులతో కూడిన వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించింది. క్లిష్టమైన బ్రెయిన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించింది. ప్రతి దశలోనూ వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించి చిన్నారి ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. ఆపరేషన్ అనంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడింది.
కేవలం 72 గంటల్లోనే అతను నడవడం ప్రారంభించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వైద్యుల కృషి ఫలించినందుకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది కూడా చిన్నారి కోలుకోవడాన్ని హర్షించారు. ఒక వైపు వైద్య నైపుణ్యం, మరోవైపు మానవత్వం కలిసివస్తే అద్భుతాలు సాధ్యమవుతాయని ఈ ఘటన నిరూపించింది. ఆర్థిక ఇబ్బందులు చికిత్సకు అడ్డంకి కాకూడదనే సందేశాన్ని కూరపాటి హాస్పిటల్ ఆచరణలో చూపించింది. డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ సేవాభావాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న నిపుణుల బృందం సమిష్టి కృషి చిన్నారికి కొత్త జీవితాన్ని అందించింది. తల్లిదండ్రుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు పూయించగలిగింది. నిరాశ అంచుల్లో నిలిచిన కుటుంబానికి ఈ వైద్యం ఆశాకిరణంగా మారింది. మానవత్వంతో కూడిన వైద్యసేవలకు ఈ ఘటన చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచింది.






