- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది: వైఎస్ షర్మిల
ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని అన్నారు. మళ్లీ కేసీఆర్ గెలిచి ఉంటే ఇదంతా బయటకు వచ్చేది కానది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఫోన్ ట్యాపింగ్‌లు చేయలేదని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేసిన తనకే ఆడియో వినిపించారని అన్నారు. కానీ ఆ సమయంలో ఒక పక్క జగన్, మరో పక్క కేసీఆర్ సీఎంలుగా ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలిపారు. అప్పటికే తనను తొక్కే ప్రయత్నాలు చాలా చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తాను పోరాటం చేసినా రెండు రాష్ట్రాల్లో కూడా దర్యాప్తు జరిగేది కాదని చెప్పారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మొత్తం అప్పుడు వాళ్ల చేతుళ్లోనే ఉందని అన్నారు.
Next Story






