సింగరేణి సమస్యలపై కవిత సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌ పార్టీ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేడు క‌విత భూపాల‌ప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..

సింగరేణి సమస్యలపై కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌ పార్టీ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేడు క‌విత భూపాల‌ప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సింగ‌రేణి అధికారుల పీఆర్పీ చెల్లింపున‌కు డిప్యూటీ సీఎం లంచం అడుగుతున్నార‌ని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో అంతలా అవినీతి పెరిగిపోయిందని అన్నారు. నిషేధిత డిటోనేట‌ర్ల కొనుగోలు, కారుణ్య నియామ‌కాలు, మెడిక‌ల్ బోర్డు లాంటి కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు.

ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వానికి జూలై 20 వ‌ర‌కు డెడ్ లైన్ విధించారు. ఏ మైన్‌కు వెళ్లినా రెండు ప్రధాన సమస్యలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడం వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు ఇవ్వడంలేదన్నారు. దానివల్ల కార్మికుల భద్రతకు ముప్పు కలుగుతోందని వ్యాఖ్యానించారు. కార్మికులకు హక్కుగా ఉన్న కారుణ్య నియామకాలను ఇవ్వడంలేదని విమర్శించారు. కార్మికుల హక్కుల గురించి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సింగరేణిలో కనీసం మంచినీరు, ఆక్సీజన్ ఇవ్వలేదని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

Next Story