YS Jagan : చిలుకూరు అర్చకులు రంగరాజన్‌కు వైఎస్ జగన్ పరామర్శ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-19 11:44:55  IST  )

రామరాజ్యం ఆర్మీ వీరరాఘవరెడ్డి బృందం దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్(Rangarajan)ను వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jagan) పరామర్శించా(Consulted)రు.

YS Jagan : చిలుకూరు అర్చకులు రంగరాజన్‌కు వైఎస్ జగన్ పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్ : రామరాజ్యం ఆర్మీ వీరరాఘవరెడ్డి బృందం దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్(Rangarajan)ను వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jagan) పరామర్శించా(Consulted)రు. రంగరాజన్ కు ఫోన్ చేసిన జగన్ దాడి జరిగిన తీరు..ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామరాజ్యం ఆర్మీ డిమాండ్లు..జరిగిన వాగ్వివాదం..తనను చిత్రహింసలు పెట్టిన తీరును జగన్ కు రంగరాజన్ వివరించారు.

వారితో కలిసి పనిచేయడానికి నిరారించినందుకే నాపై దాడికి పాల్పడ్డారని..ఘటనపై పోలీసు కేసు నమోదైందని..నిందితులను 22మందిని గుర్తించి చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నారని రంగరాజన్ వివరించారు. దివంగత వెఎస్సార్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని రంగరాజన్ ఈ సందర్భంగా జగన్ కు గుర్తు చేశారు.

జగన్ స్పందిస్తూ మేమంతా మీతో ఉన్నామని..ధైర్యంగా ఉండాలని..భయపడాల్సిన అవసరం లేదని రంగరాజన్ కు భరోసానిచ్చారు. రామరాజ్యం ఆర్మీ దాడికి గురైన రంగరాజన్ కు పలువురు సీఎంలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి పెద్ద ఎత్తున పరామర్శలు అందాయి. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Next Story