- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలి: ప్రొ. వి. బాలకిష్టారెడ్డి
యువతీయువకులు వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: యువతీయువకులు వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి పిలుపునిచ్చారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు – విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమాన్ని శుక్రవారం గచ్చిబౌలిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి, డిఆర్డీఓ ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో 50,000 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భారత్ రక్షణ పరిశోధన, శాస్త్రసాంకేతిక పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొ. వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు న్యాయం, సాంకేతికత అభివృద్ధి దశలను వివరిస్తూ, విమానయాన, అంతరిక్ష సాంకేతికత ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు. అలాగే, వాయు, అంతరిక్ష న్యాయ వ్యవస్థలో జరుగుతున్న కొత్త పరిణామాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతికతను దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్రను నిలబెట్టిందని చెప్పారు. భారతదేశం విశ్వంలో ఒక యువ దేశంగా ఉన్నందున, వికసిత్ భారత్‌ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.






