బహిర్భూమికి వెళ్లిన యువతి మృతి.. గ్రామంలో కలకలం

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-11 12:05:51  IST  )

ధరూర్ గ్రామంలో విషాదం

బహిర్భూమికి వెళ్లిన యువతి మృతి.. గ్రామంలో కలకలం
X

బావిలో దూకి యువతి ఆత్మహత్య

- ధరూర్ గ్రామంలో విషాదం

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బాలే లక్ష్మణ్ పద్మ దంపతుల కుమార్తె దివ్య(26) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. బహిర్భూమికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన దివ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలో వ్యవసాయ బావిలో దూకిన దివ్యను గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దివ్య మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story