ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో మైనర్‌‌ను ట్రాప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే?

by Ramesh Naini |   (  Updated:2025-05-16 11:15:14  IST  )

ఇన్‌స్టాగ్రామ్‌లో అపరిచితులతో పరిచయాలు పెంచుకోని కొంత మంది యువత తీవ్రంగా నష్టపోతున్నారు. తీయని మాటలతో పరిచయాలు పెంచుకొని, ప్రేమ పేరుతో కేటుగాళ్లు ట్రాప్ చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో మైనర్‌‌ను ట్రాప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వాడకం నేటి యువతలో మరింత ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా (Instagram) ఇన్‌స్టాగ్రామ్‌లో అపరిచితులతో పరిచయాలు పెంచుకోని కొంత మంది యువత తీవ్రంగా నష్టపోతున్నారు. తీయని మాటలతో పరిచయాలు పెంచుకొని, ప్రేమ పేరుతో కేటుగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఉచ్చులో చిక్కుకోని కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లను ట్రాప్‌ చేసి పలు అరాచకాలకు పాల్పడిన ఘటనలు అధికం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ మైనర్‌ను యువకుడు (trap) ట్రాప్ చేశారు. చివరకు యువకుడు పెట్టే వేధింపులు తట్టుకోలేక భాదితురాలు ఆత్మహత్యాయత్నానికి యత్నించింది.

(Rachakonda Police Commissionerate)రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఘట్కేసర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ప్రేమ పేరుతో ఓ (minor) మైనర్‌ను అవినాష్ రెడ్డి అనే యువకుడు ట్రాప్ చేశారు. మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకోని ప్రేమాయణం సాగించాడు. తనతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతని అసలు రూపం బయటపడింది. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి ప్రియురాలితో బెదిరింపులకు దిగాడు. చివరకు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకొని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని అవినాష్ రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేశాడు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి రహస్యంగా ప్రియురాలు బంగారు ఆభరణాలు తీసుకుని అవినాష్ రెడ్డికి ఇచ్చింది. అయిన కూడా నిందితుడు ఫోటోలు డిలీట్ చేయకుండా బ్లాక్ మెయిల్‌కు దిగాడు. దీంతో ఏం చేయాలో తెలియక మైనర్ ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. విషయం తెలుసుకున్న మైనర్‌ తండ్రి ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించి.. అవినాష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story