- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
మండల కేంద్రానికి చెందిన తాళ్ల కార్తీక్ (19) అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
- గంగాధర మండల కేంద్రంలో విషాధం
దిశ,గంగాధర : మండల కేంద్రానికి చెందిన తాళ్ల కార్తీక్ (19) అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచుగా కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేవాడని, ఇదివరకూ కూడా ఒకసారి డిష్ వైర్ తో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్సై తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. శుక్రవారం కార్తీక్ పుట్టిన రోజు కాగా, కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు జరుపుకున్న అనంతరం అతిగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని ఎస్సై పేర్కొన్నారు. రాత్రి అందరూ నిద్రపోగా, శనివారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూడగా కార్తీక్ ఇంట్లోని గదిలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారని ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వంశీకృష్ణ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, గంగాధర పోలీసులు, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రావు, వైద్య బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు.






