- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ ముదిరాజ్ (23) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
- మృతుడి శరీరంపై గాయాలు?
- కేసు నమోదు చేసిన పోలీసులు
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ ముదిరాజ్ (23) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచన్ పల్లి లోని ఒక యువతిని వెంకటేష్ ప్రేమించాడని తెలిసి మాచన్ పల్లి, గాజులపేట గ్రామాలకు చెందిన కొందరు యువకులు వెంకటేష్ ను చిత్ర హింసలకు గురిచేసి చెట్టుకు ఉరివేసి చంపారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుడి శరీరం వెనుక భాగంలో తీవ్ర గాయాలు, వృషణాలు చిదిమేసి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు రిజిస్టర్ చేసినట్లు, శుక్రవారం పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ గాంధీనాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.






