- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dating: యువతితో డేటింగ్ చేసి విదేశాలకు పారిపోయిన యువకుడు.. గతంలో ఫిర్యాదు.. నేడు అరెస్ట్
డేటింగ్ పేరుతో యువతిని మోసం చేసి విదేశాలకు పారిపోయిన యువకుడిని ఎయిర్‌పోర్టులో పోలీసులు పట్టుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డేటింగ్ (dating) పేరుతో యువతిని మోసం చేసి (abroad) విదేశాలకు పారిపోయిన యువకుడిని ఎయిర్‌పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు (SR Nagar Police) వచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అమీర్‌పేట్‌కు చెందిన యువతిని బెంగుళూరులోని కామన్ ఫ్రెండ్స్ మీటింగులో కలిసి, తొలిచూపులోనే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, యువతిని వేలూరి శశాంక్ అనే యువకుడు శారీరికంగా లోబరుచుకున్నాడు. ఉన్నత చదువులు (మాస్టర్స్) కోసం యూకే వెళ్లి తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటానని, అలాగే తనని కూడా విదేశాలకు తీసుకెళ్తానని శశాంక్ యువతిని నమ్మించాడు. తీర విదేశాలకు వెళ్లిన తర్వాత యువతిని శశాంక్ దూరం పెట్టడం చేశాడు.
యువతికి చెందిన సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయడంతో ఆమె మోసపోయానని గ్రహించింది. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించి.. 2023 డిసెంబర్ 30వ తేదీన యువకుడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు విదేశాలకు వెళ్లిన శశాంక్‌పై ఎస్ఆర్ నగర్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నాడని ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం అందించడంతో, ఎయిర్‌పోర్టులో పోలీసులు శశాంక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.






