- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఓపెనింగ్.. 50% పోలీస్ పిల్లలు, 50% ఇతరులకు అడ్మిషన్స్
సైనిక్ స్కూల్స్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: సైనిక్ స్కూల్స్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా (Young India Police School) యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించనున్నారు. రేపు (ఏప్రిల్ 10) ఉదయం 9:45 గంటలకు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగబోతుంది. ఈ ఓపెనింగ్‌కు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), పలువురు మంత్రులు హజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. పోలీస్ లైఫ్ అనేది చాలా కష్టంతో కూడుకున్నదని, వారి డ్యూటీల కారణంగా కుటుంబంతో తక్కువ సమయం గడపాల్సి వస్తుందన్నారు. ఇక, ఈ స్కూల్స్‌లో 50% అడ్మిషన్స్ అమరుల పిల్లలు, హోంగార్డ్స్, కానిస్టేబుల్స్ నుంచి ఐపీఎస్ ర్యాంకు అధికారుల పిల్లల వరకు రిజర్వ్ ఉంటుందని తెలిపారు. మరో 50% అడ్మిషన్స్ నాన్ పోలీస్ పిల్లలకు(సివిలియన్) ఉంటాయని తెలిపారు. ఈ స్కూల్స్‌లో ఫీజులు కూడా రిజనబుల్‌గా ఉంటాయని చెప్పుకొచ్చారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ఇంటర్నేషనల్ లేవల్ ఎడ్యుకేషన్, సీబీఎస్‌సీ సిలబస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే స్పోర్ట్స్, తర్వాతి తరానికి క్రమశిక్షణ, నాయకత్వ విలువలు నేర్పించేలా కృషి చేస్తారని వెల్లడించారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రతి చిన్న అంశాన్ని పరిశీలించటం, 1200కిపైగా అతిథులు హాజరవుతుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంలో ఎంతో బిజీగా ఉన్నామని ఆయన తెలిపారు. ఎంతోమంది చిన్నారులకు ఉజ్వలమైన భవిష్యత్‌ను అందించే ఈ పాఠశాల తెలంగాణ పోలీస్ శాఖ చరిత్రలోనే అతిపెద్ద మైలురాయని తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.






